సీఐడీ అధికారి సినీల్ కుమార్ పై ఆయన భార్య అరుణకుమారి ఫిర్యాదు చేసినా.. ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి నిలదీశారు. భార్యను వేధించే వ్యక్తికి, ఉన్నత పదవి ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు. సామాన్య మహిళలతో పాటు, ప్రముఖులకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.
మహిళా పోలీస్ స్టేషన్లు ప్రారంభించిన రోజే తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఫిర్యాదు చేస్తే, ఇంతవరకు పరిష్కారం లేదని దుయ్యబట్టారు. మహిళా శాసనసభ్యురాలికే న్యాయం చేయలేని ప్రభుత్వం, సామాన్య మహిళలకు ఎలా రక్షణ కల్పిస్తుందని మండిపడ్డారు.
ఇవీ చూడండి: