ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు వైకాపా తరపున అభ్యర్థులు నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్లు దాఖలుకు ఇవాళ చివరి రోజు కావడం, మంచి ముహూర్తం ఉండటంతో ఇవాళ నామపత్రాలు దాఖలు చేయాలని వైకాపా నిర్ణయించింది. ఎమ్మెల్యేల కోటాలో ఆరు ఎమ్మెల్సీలు ఖాళీలవ్వగా.. వాటికి అభ్యర్థులను వైకాపా ఇప్పటికే ప్రకటించింది. సి.రామచంద్రయ్య, మహమ్మద్ ఇక్బాల్, కరీమున్నీసా, దువ్వాడ శ్రీనివాస్, చల్లా భగీరథ రెడ్డి, కళ్యాణ్ చక్రవర్తి అభ్యర్థిత్వాలను సీఎం జగన్ ఖరారు చేశారు.
నేడు ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను అభ్యర్థులు కలవనున్నారు. శాసన మండలి సభ్యులుగా అవకాశం కల్పించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలపనున్నారు. అనంతరం అందరూ నేరుగా శాసన మండలికి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటల తర్వాత శాసన మండలి కార్యదర్శికి నామపత్రాలు అందించనున్నారు.
ఇదీ చదవండి