రాష్ట్రంలో నిలిచిపోయిన రేషన్ సరుకుల పంపిణీకి సత్వర చర్యలు చేపట్టాలని తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్‌బాబు డిమాండ్ చేశారు. దాదాపు 30 వేల మంది డీలర్లతో సాఫీగా నడిచే వ్యవస్థను ఇంటింటికీ రేషన్ పేరుతో నిర్వీర్యం చేశారని విమర్శిస్తూ... సీఎం జగన్‌కు బహిరంగ లేఖ రాశారు.
రేషన్ సరుకుల పంపిణీ లేక... కరోనా సమయంలో పనులు లేక పేదలు అల్లాడుతున్నారని చెప్పారు. రేషన్ పంపిణీకి 769 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ... ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కరోనా తొలిదశలో 52 మంది డీలర్లు మరణించారని... వారికి పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: