అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జగ్గయ్యపేట మండలంలోని రావిరాల గ్రామంలో ప్రభుత్వ విప్ ఉదయభాను పర్యటించి ప్రజలతో మాట్లాడారు. మండలంలోని ముక్త్యాల గ్రామ సమీపంలోని పులిచింతల ప్రాజెక్ట్‌కు వరద నీరు భారీగా చేరడంతో అధికారులు ప్రకాశం బ్యారేజీకు నీటిని విడుదల చేస్తున్నారని తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టంతో నిండిపోయిందని వెల్లడించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులు అన్ని నిండటంతో పులిచింతల ప్రాజెక్టు నుంచి 7.80 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారన్నారు. దీంతో కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని, ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగకుండా సహాయక చర్యలు తీసుకోవడంలో పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి...