మాట తప్పడంలో సీఎం జగన్ చరిత్ర సృష్టించారని తెదేపా ఎమ్మెల్యే డోలా బాల వీరంజనేయస్వామి ఆరోపించారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఇచ్చే పింఛన్ మొత్తాన్ని ఏటా రూ. 250 చొప్పున పెంచుతానని చెప్పి... వారిని మోసం చేశారని అన్నారు. ఇప్పటికైనా పింఛన్ల మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ ముసుగులో ఉన్న కార్యకర్తల ఆగడాలతో... అర్హత ఉన్న దళిత, గిరిజన లబ్ధిదారులు అనర్హులుగా మిగిలిపోతున్నారని మండిపడ్డారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఖమ్మంలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ కారుకు నిప్పంటించిన స్థానికులు