ETV Bharat / state

విజయవాడలో ఎన్నికల నిర్వహణలో .. తొలి నుంచి తడబాటే! - విజయవాడలో ఎన్నికల నిర్వహణ తాజా వార్తలు

కీలకమైన ఎన్నికల సమయంలో విజయవాడ కార్పొరేషన్‌కు సంబంధించి అధికారులు తడబాటుకు గురవుతున్నారు. దీనివల్ల ఓటర్లలో అనవసర గందరగోళానికి తావిచ్చినట్లు అవుతోంది. ఎన్నికల విషయంలో తొలి నుంచి పక్కా ప్రణాళికతో వెళ్లడంలో అధికారులు విఫలమవుతున్నారు. రాష్ట్రంలోనే రెండో పెద్ద కార్పొరేషన్‌ విజయవాడ. అయినా.. సరైన జాగ్రత్తలు తీసుకోవడంలో వైఫల్యం కనిపిస్తోంది. ఓటరు జాబితా.. పోలింగ్‌ కేంద్రాల మార్ఫు. అభ్యర్థుల తుది జాబితా.. పోలింగ్‌ శాతం.. ఇలా అనేక అంశాల్లో స్పష్టత కొరవడింది. లెక్కింపు ఆదివారం నాడు చేపడుతున్నారు. దీనికి సంబంధించి సిబ్బందికి శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. లెక్కింపులో అయినా తడబాట్లకు తావులేకుండా వ్యవహరించాల్సి ఉంది.

Mistakes of officials in the conduct of elections in Vijayawada from the  beginning
విజయవాడలో ఎన్నికల నిర్వహణ
author img

By

Published : Mar 13, 2021, 2:47 PM IST

పేరుకే నగరమైనా విజయవాడలో ఎన్నికల నిర్వహణలో మాత్రం పలు తప్పులు జరిగాయి. ఎన్నికలలో ఓటర్ల పేర్లు, నామినేషన్లు, ఉపసంహరణ, ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూంలు, బ్యాలెట్ బాక్సుల దాకా అన్నిట్లోనూ అధికారుల జాప్యం కనపడుతోంది.

విజయవాడ నగరంలోని పలు పోలింగ్‌ కేంద్రాల చిరునామాలను మార్చేశారు. గత ఏడాది నామినేషన్లు స్వీకరించిన సమయంలో మారిన పోలింగ్‌ కేంద్రాలపై ఎటువంటి ప్రకటన చేయలేదు. వారం రోజుల ముందు హడావుడిగా పోలింగ్‌ కేంద్రాలను మార్చేశారు. భవానీపురం సర్‌ ఆర్థర్‌ కాటన్‌ పబ్లిక్‌ స్కూల్లోని పోలింగ్‌ కేంద్రాన్ని ఆర్టీసి వర్క్​షాపు రోడ్డు రవీంద్రభారతి స్కూల్​కు మార్చారు. ఆర్టీసీ వర్క్​షాపు రోడ్డులోని అన్న క్యాంటీన్‌ భవనంలోకి కూడా కొన్ని బూత్‌లను మార్చారు.

  • నగరంలోని ఓటర్ల జాబితా సరవణ ప్రక్రియ సజావుగా సాగలేదు. పలువురు ఓటర్లు మరణించగా, వారి పేర్లు జాబితాలోనే ఉంచారు. కొందరు నగరం విడిచి వెళ్లిపోగా, మరికొందరు విదేశాల్లో ఉంటున్నారు. పలువురు హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు వంటి నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అటువంటివారు 40వేలకు పైగా ఉన్నారు. వారిని ముందుగానే తొలగించి జాబితాను సవరించలేదు.
  • అభ్యర్థుల నుంచి నామపత్రాలను గత ఏడాది మార్చిలో స్వీకరించారు. ఈ దఫా మార్చి 2, 3 తేదీల్లో అభ్యర్థుల ఉపసంహకరణతో ప్రక్రియ తిరిగి మొదలైంది. ముందుగా 801 మంది అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేయగా, 733 మంది అభ్యర్థుల నామినేషన్ల సక్రమమైనవిగా తేల్చారు. నామినేషన్ల ప్రక్రియ ఉపసంహరణ అనంతరం 348 మంది బరిలో ఉన్నట్లు ప్రకటించారు. వారికి గుర్తుల కేటాయింపు, బ్యాలెట్‌ పత్రాల ముద్రణ ప్రక్రియ ప్రారంభించారు.
  • అయితే 27వ డివిజన్‌ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థి ఒకరు మరణించారు. అభ్యర్థి పేరు తొలగించకుండానే బ్యాలెట్‌ పత్రాలు సిద్ధం అవుతుండగా ఆఖరి నిమిషంలో గుర్తించారు. తర్వాత సవరణ జాబితా విడుదల చేశారు.
  • పోలింగ్‌ పూర్తి అయిన అనంతరం బ్యాలెట్‌ బ్యాక్సులకు సీల్‌ వేసి తరలించాల్సి ఉంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా 28వ డివిజన్‌లోని రెండు కేంద్రాల్లో ఖాళీ పెట్టెలకూ సీళ్లు వేశారు. దీనిపై రగడ జరిగింది. 23వ డివిజన్‌లోని కర్నాటి రామ్మోహనరావు పాఠశాల కేంద్రంలోని ఓ పెట్టకు సీలు వేయకుండానే స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించారు. ఆ తర్వాత స్ట్రాంగ్‌రూం వద్ద అభ్యర్థుల సమక్షంతో తిరిగి సీళ్లు వేశారు.

ఇదీ చూడండి.

ఏ మెుహం పెట్టుకుని ఓట్లు అడగుతారు?: సీపీఐ రామకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.