క్షిపణి పరీక్ష కేంద్ర శంకుస్థాపన త్వరలోనే..! కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోద వద్ద ఏర్పాటు చేయనున్న క్షిపణి పరీక్ష కేంద్రానికి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి రక్షణశాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. శంకుస్థాపనకు అనుకూల ప్రదేశాలను కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తున్న ప్రదేశాన్ని మ్యాప్ ద్వారా డీఆర్డీవో అధికారులు కలెక్టర్కు వివరించారు. ఓఎన్జీసీ హెలిప్యాడును పరిశీలించిన కలెక్టర్.. శంకుస్థాపన, బహిరంగ సభలకు నాగాయలంక జిల్లా పరిషత్ హైస్కూలు, అవనిగడ్డ డిగ్రీ కళాశాల మైదానాలలో ఒకటి ఎంపికచేయాలని అధికారులను ఆదేశించారు. నాగాయలంక-గుల్లలమోద రహదారికి మరమ్మతులు చేయాలని సూచించారు.
ఇదీ చదవండి :
నవ్యాంధ్ర సిగలో క్షిపణి పరీక్ష కేంద్రం