గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ రోగులకు అందుతున్న వైద్య చికిత్సపై మంత్రులు సమీక్షించారు. ఇప్పటివరకు ఉన్న 20 ఆక్సిజన్ బెడ్లను 50కి పెంచటానికి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో తగినంత సిబ్బందిని నియమించుకోవాలని సూపరింటెండెంట్‌కు మంత్రులు ఆదేశించారు. కొవిడ్ వైద్యం తీసుకుంటున్న వారికి ఆక్సిజన్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఆసుపత్రిలో పారిశుధ్యం, అలాగే నాణ్యమైన భోజన సదుపాయాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: ఎంపీ రఘురామకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు