ETV Bharat / state

'బాలకృష్ణ చిన్న పిల్లోడు... ఆయన్ను పెద్దగా పట్టించుకోనక్కర్లేదు' - చంద్రబాబుపై మంత్రుల విమర్శలు

విజయవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి, కొడాలి నాని తెదేపా అధినేతపై విమర్శలు సంధించారు. పార్టీలో వచ్చిన విభేదాలను చక్కదిద్దుకోవాలని చంద్రబాబుకు సూచించారు. గుంటూరు, విజయవాడలో వైకాపానే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ministers peddireddy and kodali nani comments on chandrababu and balakrishna
మంత్రి పెద్దిరెడ్డి, కొడాలి నాని
author img

By

Published : Mar 7, 2021, 7:11 AM IST

Updated : Mar 7, 2021, 7:22 AM IST

గుంటూరు, విజయవాడ మేయర్‌ స్థానాలను అత్యధిక మెజారిటీతో వైకాపానే కైవసం చేసుకుంటుందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో నాలుగైదు స్థానాల్లోనూ తెదేపా గెలవబోదని చెప్పారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి ప్రచారం నిర్వహించారు.

ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం మిగలదు..!

‘చంద్రబాబు మా గురించి మాట్లాడే ముందు ఆయన ఇల్లు చక్కదిద్దుకోవాలి. విజయవాడలో తెదేపా నేతల ప్రకటనలను చూస్తూనే ఉన్నామని అన్నారు. చిత్తూరు జిల్లాలో పంచాయతీల్లో, ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. అందువల్లే చంద్రబాబు నాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వెల్లడించారు. చిత్తూరు జిల్లాలో ఆయన పోటీ చేసేందుకు ఒక్క అసెంబ్లీ నియోజకవర్గమూ మిగలదని... ఆయన కుమారుడిలాగే గుంటూరుకో, విజయవాడకో వచ్చి పోటీ చేసుకోవాల్సిందే’ అని వ్యాఖ్యానించారు.

'బాలకృష్ణ చిన్న పిల్లోడు'

మంత్రి కొడాలి నాని

చంద్రబాబు విశాఖకు వెళ్లి స్టీలు ప్లాంటును జగన్‌ ప్రైవేటీకరిస్తారని చెబుతున్నారని నాని మండిపడ్డారు. కానీ ప్రధాని మోదీని ఒక్క మాటా అనలేకపోతున్నారు’ అని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌ వీడియో గేమ్స్‌ ఆడుకుంటూ ప్రజలను వదిలేశారన్న ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ‘బాలకృష్ణ ఆటలో అరటిపండు, చిన్నపిల్లోడని ఎద్దేవా చేశారు. వాళ్ల బావ రాసిచ్చే స్క్రిప్టును చదివే వ్యక్తని.. ’ అని వ్యాఖ్యానించారు.

'హైకోర్టు ఆదేశాలు పాటిస్తాం'

వాలంటీర్లు ఫోన్లు అప్పగించాలన్న హైకోర్టు ఆదేశాల గురించి విలేకరులు ప్రస్తావించగా.. ‘న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. వాలంటీర్లు వారి విధుల్లో పాల్గొంటారని... ఫోన్ల విషయంలో వారికి ఇబ్బంది లేదని అన్నారు. ఎన్నికల్లో వారి ఇష్టాయిష్టాల ప్రకారం చేయవచ్చు’ అని చెప్పారు.

రాష్ట్రంలో ఉన్న ప్రజా ప్రభుత్వాన్ని నియంత్రిస్తామని భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడటం అవివేకమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు . ఎవరి పొత్తుతోనో, ఎవరి శక్తిపైనో ఆధారపడి వైకాపా అధికారంలోకి రాలేదన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలి’ అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

నేడు విజయవాడలో చంద్రబాబు పర్యటన

Last Updated : Mar 7, 2021, 7:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.