దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా లక్షలాదిమంది నిరుపేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రులు పేర్ని నాని, అనిల్‌కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లబ్ధిదారులకు మంత్రులు ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. మొత్తం 2 వేల 433 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు.
గత ప్రభుత్వ హయాంలో పేదలకు సెంటు భూమి కూడా పంపిణీచేయని తెదేపా నాయకులు తమ ప్రభుత్వంపై అవాకులు, చవాకులు పేలటం సిగ్గుచేటని మంత్రులు మండిపడ్డారు. కేవలం పట్టాలతోనే సరిపెట్టకుండా గృహనిర్మాణ బాధ్యతలను కూడా ప్రభుత్వమే చేపడుతోందని మంత్రులు వివరించారు.
ఇదీచదవండి