కృష్ణాజిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సుడిగాలి పర్యటన చేశారు. స్వయంగా ద్విచక్ర వాహనం నడుపుతూ వీధుల్లో పర్యటించారు. 29వ డివిజన్‌లోని పశ్చిమ నియోజకవర్గం గట్టు వెనుక ప్రాంతంలో స్థానికులతో మంత్రి మాట్లాడారు. అక్కడి పరిస్థితులను పరిశీలించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ఐదేళ్లలో ఈ ప్రాంతం అభివృద్ధికి దూరమైందని, తాము రాజకీయాలకు అతీతంగా ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఇదీచూడండి.సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నా : కేశినేని నాని