విజయవాడ భవానీపురంలోని 40, 41వ డివిజన్లలో 4 కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు పనులకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. సీఎం జగన్ విజయవాడ నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని మంత్రి తెలిపారు. 5 సంవత్సరాల తెదేపా పాలనలో పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. విజయవాడ తెదేపా ఎంపీ కేసినేని నాని విజయవాడకి ఒక ప్రాజెక్టు కూడా తీసుకు రాలేదన్న మంత్రి... చంద్రబాబు నాయుడు అండ్ కో విజయవాడ ప్రజలను అమరావతి పేరుతో మోసం చేశారని ఆరోపించారు. కేశినేని నాని, దేవినేని ఉమా, బోండా ఉమా, జలీల్ ఖాన్ విజయవాడ నగర అభివృద్ధిని తుంగలో తొక్కారని మండిపడ్డారు.
ఇదీ చూడండి
శ్రీశైలానికి తగ్గిన వరద ప్రవాహం... 4గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల