కృష్ణా జిల్లా కూచిపూడిలో మంత్రి ఆదిమాలపు సురేశ్ కళా ఉత్సవాలను ప్రారంభించారు. విద్యతో పాటు సాంస్కృతిక కళలపై ఆసక్తిని పెంపొందించటం కోసం కళాఉత్సవ్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి సురేశ్ పేర్కొన్నారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 300 మంది కళాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు ఆయన వెల్లడించారు. నూతన విద్యావిధానంలో అనేక మార్పులను తీసుకువచ్చేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్, విద్యా శాఖ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు తదితరులు పాల్గొన్నారు.
ఇదీచదవండి