కృష్ణా జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి అవసరమైన అన్ని చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. మచిలీపట్నంలోని జిల్లా ఆసుపత్రితోపాటు బందరు మండలం తాళ్లపాలెం పీహెచ్‌సీ పరిధిలో వ్యాక్సినేషన్ కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. జిల్లాలో 40వేల మందికి... మచిలీపట్నంలో 470మందికి వ్యాక్సిన్ సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీతోపాటు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: