కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోలీస్ వెల్ఫేర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను రాష్ట్ర సమాచార, రవాణా శాఖల మంత్రి పేర్ని నాని ప్రారంభించారు. నగర ప్రజల అవసరాలను తీర్చడంతోపాటు, పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి అన్నారు. నగరంలోని వాహనదారులకు నాణ్యమైన ఆయిల్ లభ్యమవుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు.
కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు చొరవతో ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఫిల్లింగ్ స్టేషన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పూర్తిగా పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం వినియోగిస్తామని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు వివరించారు.
ఇదీ చదవండి: జగనన్న జీవ క్రాంతి పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్