రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో మూడో విడత వైస్సార్ వాహనమిత్ర కార్యక్రమానికి పాల్గొనేందుకు తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి బయల్దేరారు. ప్రయాణ సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ప్లాట్ ఫాం ద్వారా తన కార్యాలయానికి వచ్చిన పలువురు ప్రజలతో ముఖాముఖిగా సంభాషించారు.
వారి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి తక్షణమే వాటిని పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పడు పరిష్కరిస్తూ..మెరుగైన పాలన అందిచటమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాని వ్యాఖ్యానించారు.
ఇదీచదవండి
mansas trust:హైకోర్టు తీర్పు పూర్తిగా వచ్చాకే స్పందిస్తాం: మంత్రి వెల్లంపల్లి