ఎస్‌ఈసీ షోకాజ్ నోటీసుపై మంత్రి కొడాలి నాని లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. ఎస్‌ఈసీని కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. తొలిదశ ఎన్నికల ఫలితాలపై మీడియా సమావేశం పెట్టానని.. ఉద్దేశపూర్వకంగా ఎస్‌ఈసీని కించపరిచే వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలపై గౌరవం ఉందని పేర్కొన్నారు. ప్రత్యేకించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను గౌరవిస్తానని కొడాలి నాని అన్నారు. ఎస్‌ఈసీ షోకాజ్ నోటీసు ఉపసంహరించుకోవాలని కోరారు.
మంత్రి కొడాలి నానికి రాష్ట్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఎన్నికల కమిషన్ పరువు, ప్రతిష్ఠకు భంగం కలిగేలా మాట్లాడారంటూ నోటీసు ఇచ్చింది. ఎన్నికల కమిషన్ ప్రతిష్ఠను దిగజార్చేలా దురుద్దేశ ప్రకటనలు ఉన్నాయని తెలిపింది. మీడియా సమావేశంలో వ్యాఖ్యలపై తక్షణమే వివరణ ఇవ్వాలని కోరింది. ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు బహిరంగ ప్రకటన చేయాలని... సాయంత్రం 5 గంటల్లోగా మంత్రికానీ, ప్రతినిధి ద్వారా కానీ సమాధానం ఇవ్వాలని ఎస్‌ఈసీ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: కొడాలి నానికి ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు