కృష్ణా జిల్లా జి.కొండూరులో ఏర్పాటు చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అర్హులైన 414 మంది పేదలకు పట్టాలను మంత్రి నాని, ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో అభివృద్ధిని చూడలేక.. తెదేపా నేతలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. అభివృద్ది, సంక్షేమానికి రెండు కళ్లులా పనిచేస్తున్న జగన్మోహనరెడ్డి పాలనలో శాసనసభ్యునిగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రేపు తెదేపా పొలిట్ బ్యూరో సమావేశం... 13 అంశాలపై చర్చ