నదుల్లో నీటి ప్రవాహం ఉండడం వల్లే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ఈ విషయం తెలిసి కూడా పవన్‌కల్యాణ్ ప్రభుత్వంపై అనవసరమైన విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అనవసర ఆరోపణలు చేస్తే ఉన్న ఒక్క సీటు, తెదేపాకు ఉన్న 23 సీట్లు కూడా గల్లంతవుతాయని హెచ్చరించారు. కృష్ణా జిల్లా గుడివాడ మండలం మల్లయపాలెంలో 14 లక్షల వ్యయంతో నిర్మించిన అంగన్వాడి భవనాలను మంత్రి ప్రారంభించారు. త్వరలోనే ఇసుకకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని చెప్పారు.
ఇదీ చూడండి: