Awareness on Cyber Crime : మాతృభాషలో మాత్రమే కాదు ఇతర భాషల్లోనూ మంచి పట్టుంది. ఇంకేముంది కెరీర్లో దూసుకుపోవచ్చు. తక్కువ కాలంలోనే ఉన్నతస్థాయికి . వెళ్లొచ్చు. ఇది కాయిన్‌కు ఒకవైపు మాత్రమే. అలా నేర్చుకున్న ఇంగ్లీష్, హిందీ భాషలు సైబర్ మాయగాళ్ల బారినపడేలా చేస్తాయని జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌కు స్పందించవద్దని సూచిస్తున్నారు.
హిందీ, ఇంగ్లిష్ తెలిసిన వారికి ఎర: ఇప్పటి వరకూ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కేందుకు అమాయకత్వం, అవగాహనలోపమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. వీటన్నింటికీ మించి హైదరాబాద్‌లో ఎక్కువ మందికి హిందీ మాట్లాడటం రావటం వల్ల కూడా మోసాల బారినపడేందుకు ఒక కారణమని అంటున్నారు. సీబీఐ, ఈడీ, సైబర్‌క్రైమ్ పోలీసులమంటూ ఫోన్‌కాల్ చేస్తున్న మాయగాళ్లు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడుతూ పరిచయం చేసుకుంటున్నారు.
ఇలాంటి వాటికి హిందీ, ఇంగ్లీష్ తెలిసిన వారు వేగంగా స్పందిస్తున్నారు. అదనపు ఆదాయం వస్తుందనే ఆశతో తమ కష్టార్జితాన్ని కోల్పోతున్నారు. జీవితంలో ఎదిగేందుకు ఊతమిచ్చే కమ్యూనికేషన్ స్కిల్స్ సైబర్ నేరస్థులకు వరంలా మారింది. సైబర్ ముఠాలు కూడా హిందీ, ఇంగ్లీష్ భాషలు తెలిసిన యువకులకు పెద్దమొత్తంలో కమీషన్ ఆశచూపి ఏజెంట్లుగా పెట్టుకుంటున్నాయి. వారి ద్వారానే ఉద్యోగులు, గృహిణుల, వ్యాపారులను మోసగిస్తున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
సైబర్ క్రైం బారిన పడ్డారా? - ఆలస్యం ఎందుకు 'గోల్డెన్ అవర్' గురించి తెలుసుకోండి
చదువుకున్నోళ్లే ఎందుకంటే: నగరంలో రోజూ సుమారుగా 10-15 మంది సామాన్యులు సైబర్ నేరగాళ్ల బారినపడి కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. 10 నెలల వ్యవధిలో 300 కోట్లు రూపాయలు సైబర్ నేరగాళ్ల ఖాతాల్లో కుమ్మరించారు. బాధితుల్లో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులు, వ్యాపారులు, ఐటీ నిపుణులే ఉంటున్నారు. వారు ఫోన్ చేసిన వ్యక్తులకు ఏ భాష వచ్చు అనేది తెలుసుకున్నాకే మాటలు కలుపుతున్నారు. వీడియోకాల్ చేసినప్పుడు యూనిఫామ్ వేసుకుని కనిపిస్తారు.
ఎందుకిలా మోసపోతున్నామంటే:
- సైబర్‌క్రైమ్ పోలీసులు బాధితులను దీనిపై ప్రశ్నించినపుడు వారి స్పందన ఇలా ఉంది.
- ప్రముఖ కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలను ఇస్తున్నారు. తీరా పెద్దమొత్తంలో నగదు కట్టాక మోసం చేస్తున్నారు.
- సీబీఐ, ఈడీ, సైబర్‌క్రైమ్ పోలీసులమని మా పాన్‌కార్డు, ఆధార్, ఇంటి అడ్రస్ వివరాలు చెబుతుంటే భయపడుతున్నాము.
- ఈ విషయం బయటకు చెప్తే కుటుంబసభ్యలంతా కేసుల్లో ఇరుక్కుంటారంటే ఎటూ తేల్చుకోలేకపోతున్నాం.
స్టాక్ మార్కెట్లో లాభాల ఎర! - కోటి రూపాయలు పోగొట్టుకున్న సివిల్ ఇంజినీర్
"నేను కూడా సైబర్ నేరగాళ్లకు టార్గెట్టే" - ఆ నంబర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి : విశాఖ సీపీ