Sisters Performing Amazing in Kuchipudi and Classical Music : పుస్తకాలతో పరుగులు పెడుతున్న ప్రస్తుత తరుణంలో ప్రాచీన కళపై మక్కువ పెంచుకున్నారు ఆ సోదరీమణులు. అటు చదువులోనూ ఇటు కళల్లోనూ రాణిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. తమలో దాగున్న అంతర్గత ప్రతిభకు పదును పెడుతూ నాట్యం, సంగీతంలో జాతీయ స్థాయి ఖ్యాతిని తెచ్చుకుంటూ ఎంతో మంది ప్రముఖుల మన్ననలు పొందుతున్నారు. వయస్సుకు మించిన ప్రతిభ కనబరుస్తూ ప్రశంసలు, జ్ఞాపికలతో నేటి బాలలకు ఆదర్శంగా నిలుస్తున్న విజయవాడకు చెందిన అక్కాచెల్లెళ్లపై ప్రత్యేక కథనం.
పది ప్రపంచ రికార్డులు : తమ నృత్యంలో హవభావాలతో అందర్ని మంత్రముగ్దుల్ని చేస్తున్నారు హేమ వైష్ణవి, మహిమ. వీరు విజయవాడకు చెందిన రాంప్రసాద్-కనకదుర్గ దంపతుల కుమార్తెలు.హేమ వైష్ణవి ఎనిమిదోవ తరగతి, మహిమ ఆరోవ తరగతి చదువుతున్నారు. కరోనా సమయంలో ఖాళీగా ఉండటం ఎందుకని కూచిపూడి నృత్యం నేర్చుకొవాలని భావించారు ఈ అక్కాచెల్లెళ్లు. ఈ విషయాన్ని తల్లికి చెప్పారు. పిల్లల ఇష్ట ప్రకారం ఆన్ లైన్ లో నృత్యంలో శిక్షణ ఇప్పించారు. అలా దాదాపు నాలుగు సంవత్సారాలుగా గురువురాలు అనూషానాయుడు దగ్గర తర్ఫీదు పొందుతున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో వందకు పైగా ప్రదర్శనలు చేశారు. హావభావాలు, మనసు దోచే నృత్య భంగిమలతో ఆహుతులను అలరించి ప్రముఖుల చేత ప్రశంసలు అందుకున్నారు. పది ప్రపంచ రికార్డులు, నంది అవార్డు, నాట్యకిరణంతో పాటు వివిధ అవార్డులు సొంతం చేసుకున్నారు.
ముద్దులొలికే ప్రాయంలో మంత్రముగ్ధుల్ని చేస్తోన్న చిన్నారి - 'వండర్ కిడ్ రికార్డు'లో చోటు
"మూడవ తరగతి నుంచే డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. చాల మంది స్టేజీలపై, యూట్యూబ్లో అద్భుతంగా కూచిపూడి డ్యాన్స్ చేస్తుంటే నాకు నేర్చుకోవాలని పించింది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో వందకు పైగా ప్రదర్శనలు చేశాం. వివిధ అవార్డులతో పాటు పది ప్రపంచ రికార్డులు వచ్చాయి. స్కూల్ నుంచి వచ్చాక డ్యాన్స్ క్లాసులకు వెళ్తున్నాం. మంచి డ్యాన్సర్ కావటం నా కల." - హేమ వైష్ణవి, కూచిపూడి నృత్యకారిణి
నాట్య మయూరీలా లక్ష్యం అదే : కూచిపూడి నృత్యంతో పాటు శాస్త్రీయ సంగీతం లోనూ మంచి ప్రతిభ కనబరుస్తున్నారు ఈ అక్కచెల్లెళ్లు. సంగీత గురువురాలు రూపా తేజశ్విని దగ్గర గత నాలుగేళ్లుగా శిక్షణ తీసుకుంటున్నారు. రాష్ట్ర, జాతీయ స్ధాయిలో పలు ప్రదర్శనలు చేశారు. దేవాలయాల్లో సైతం ప్రదర్శనలు చేశారు. పది ప్రపంచ రికార్డులు, గాన కిరణం అవార్డులతో పాటు పలు పురస్కారాలు, బహుమతులు అందుకున్నారు. తమ పిల్లలు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని హేమ వైష్ణవి, మహిమ తండ్రిదండ్రులు ఆశభావం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ లో చదువు, తమకు నచ్చిన కళల్లో రాణించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు ఈ నాట్య మయూరాలు చెబుతున్నారు.
కూచిపూడిలో గిరిజన బిడ్డల ప్రతిభ- దేశ విదేశాల్లో అద్భుత ప్రదర్శనలు - Kuchipudi in Srikakulam district
చిన్న వయస్సులోనే 15స్వర్ణ పతకాలు- జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో బహుముఖ ప్రజ్ఞ - Multi Talented Girl