రాష్ట్రంలోనే నూజివీడు మినీ పుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను అగ్రభాగన నిలుపుతామని మంత్రి కురసారల కన్నబాబు అన్నారు. నూజివీడులోని మ్యాంగో వేఫర్ హీట్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. మామిడి, జామ ఫుడ్ ప్రాసెసింగ్ లో అధునాతన ఫ్యాక్టరీలకు నూజివీడును కేంద్రంగా చేస్తామని హామీ ఇచ్చారు. మామిడి ఎగుమతులకు రాష్ట్రంలో 30 కిసాన్ రైళ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మామిడి అభివృద్ధి కోసం హెక్టారుకు 17,500 నగదు సాయం చేస్తున్నట్లు తెలిపారు. మార్కెటింగ్ పై అధ్యయనం చేసి మామిడి ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఇదీ చదవండి: