ఈఎస్ఐ ఆస్పత్రిల్లో మందుల కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం... అధికారులతో చర్చించారు. ఈ అవకతవకలపై ఏర్పాటు చేసిన కమిటీ... రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. నివేదిక ఆధారంగా ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాని మంత్రి స్పష్టం చేశారు. ఈఎస్ఐ డిస్పెన్సరీలో మందుల లభ్యతపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు.
మరోవైపు కార్మికుల సంక్షేమం కోసం వాణిజ్య సంస్థలు, పరిశ్రమల నుంచి వసూలు చేస్తున్న కార్మిక సెస్ వసూళ్లపై మంత్రి ఆరా తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పరిశ్రమల్లో వినియోగిస్తున్న బాయిలర్లలో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని... క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి