విజయవాడలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచడానికి సీఎన్జీ వాహనాలను అందుబాటులోకి తెచ్చినట్లు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తొలిదశలో 25 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. రెండు కోట్ల వ్యయంతో ఇంటింటి నుంచి చెత్త సేకరణ కోసం కొనుగోలు చేసిన 25 సీఎన్జీ వాహనాలను విజయవాడ ఇందిరాగాంధీ మైదానం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కమిషనర్ ప్రసన్న వెంకటేశ్ పాల్గొన్నారు.
రాబోయే రోజుల్లో ప్రతి వార్డులో సీఎన్జీ వాహనాన్ని చెత్త సేకరణ కోసం అందుబాటులో ఉంచుతామని మంత్రి బొత్స తెలిపారు. విజయవాడ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లను మంజూరు చేసిందని...నగరాన్ని పారిశుద్ధ్యం విషయంలో దేశంలోనే ఉత్తమంగా నిలిచేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ఇంటింటి నుంచి చెత్త సేకరణ కోసం ఆరుగురు సిబ్బంది చేసే పనిని... సీఎన్జీ వాహనాలను అందుబాటులోకి తేవడం ద్వారా ఇద్దరు మనుషులు, తక్కువ సమయంలో ఈ పనిని చేసే వెసులుబాటు కలుగుతోందని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ప్రతి వాహనానికి సీసీ కెమెరాతో పాటు జీపీఎస్ అనుసంధానం చేసినట్లు చెప్పారు.
ఇదీచదవండి