ETV Bharat / state

మైనర్ అపహరణ కేసుపై... పోలీసులు దర్యాప్తు ముమ్మరం - minar girl kidnap in vijayawada

విజయవాడ ఎంజీ రోడ్డు సమీపంలో ఓ బాలికను గుర్తు తెలియని వ్యక్తులు మత్తుమందు చల్లి అపహరించారు.ఘటనపై మైనర్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మైనర్ అపహరణ కేసుపై... పోలీసులు దర్యాప్తు ముమ్మరం

author img

By

Published : Dec 6, 2019, 5:00 AM IST

విజయవాడలో ఓ మైనర్‌ అపహరణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 3 రోజుల క్రితం ఎంజీ రోడ్డులోని స్వరాజ్‌ మైదానం వద్ద ఇద్దరు యువకులు తనపై మత్తుమందు చల్లి అపహరించారని సీపీకి ఓ బాలిక ఫిర్యాదు చేసింది. మెలకువ వచ్చేసరికి ప్రకాశం బ్యారేజీకి సమీపంలోని పొలాల్లో ఉన్నానని ఫిర్యాదులో పేర్కొంది. ఆ సమయానికి తన చేయి, మెడపై గాయాలున్నట్లు తెలిపింది. తొలుత స్థానిక పోలీసులకు ఈ విషయం తెలిపినా వారు కేసు నమోదు చేయలేదని బాలిక తెలపగా.... వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని సూర్యారావుపేట పోలీసులను సీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశించారు. ఇద్దరు ఎస్​ఐలతో ఏర్పాటైన ప్రత్యేక బృందం... సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి

బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు... దేహశుద్ధి చేశారు!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.