రాష్ట్రంలో చిక్కుకుపోయిన వలస కూలీలు, కార్మికులను స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని... కొవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణబాబు తెలిపారు. కరోనా పరీక్షలు చేసిన అనంతరం వారిని తరలిస్తామని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 60 వేలమంది వలస కూలీల వరకు ఉన్నట్లు అంచనా వేశారు. ప్రభుత్వ ఖర్చులతోనే స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తామన్నారు. రాష్ట్రంలోని 402 సహాయ శిబిరాల్లో 6,300 మంది ఇతర రాష్ట్రాల వారు ఉన్నారని వెల్లడించారు. రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్లు కృష్ణబాబు స్పష్టం చేశారు. గుంటూరు గ్రీన్‌జోన్ నుంచి కర్నూలు గ్రీన్‌జోన్‌కు తొలి బృందం పంపామని అన్నారు.
ఇతర రాష్ట్రాల్లో ఉన్న మనవారి యోగక్షేమాలపై ఆరా తీస్తున్నట్లు కృష్ణబాబు చెప్పారు. ఇప్పటివరకు మనవాళ్లు 12 వేలమంది రిపోర్టు చేశారని తెలిపారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లేందుకు 1902కు ఫోన్ చేయాలని సూచించారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఏపీ వాసుల కోసం కంట్రోల్ రూం నంబర్ 0866-2424680 ఏర్పాటు చేశామని వెల్లడించారు. సినిమా థియేటర్లు, మాల్స్, ఎగ్జిబిషన్ కేంద్రాలు మూసే ఉంటాయని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి