రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను దక్షిణామ్నాయ శృంగేరీ శారదాపీఠాధీశ్వరులు జగద్గురు భారతీతీర్ధ స్వామి ఖండించారు. కారకులైన వారిని గుర్తించి శిక్ష విధించాలని కోరారు. దాడులు అత్యంత దుఃఖాన్ని కలిగిస్తున్నాయన్న ఆయన.. భగవంతుని విషయంలో జరుగుతున్న ఇలాంటి అపరాధాలకు పాల్పడిన వారిని జన్మజన్మల దుఃఖం వెంటాడుతుందని తెలిపారు. స్వామి తరఫున తన సందేశాన్ని పీఠం ధర్మాధికారి హనుమత్ ప్రసాద్ విజయవాడలో మీడియా ముందు చదివి వినిపించారు. దాడులు మహాపాపమని.. ఇవి రాజ్యాంగానికి కూడా అత్యంత విరుద్ధమని.. దీనివల్ల దేశ ప్రజల సామరస్యానికి భంగం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా దుశ్చర్యలను ఆరంభ దశలోనే నివారించి- పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఇవీ చూడండి...: సంబరాల సంక్రాంతికి.. సొంతూళ్లకు జనాల పయనం