మార్చి 26 వ తేదిన తలపెట్టిన భారత్ బంద్‌ను ప్రజలు విజయవంతం చేయాలని విద్యార్థి, యువజన సంఘాలు విజయవాడలో పిలుపునిచ్చాయి. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని.. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బంద్‌ను చేపట్టామని నేతలు తెలిపారు. నగరంలోని దాసరి భవన్ నిర్వహించిన సమావేశంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగన్న మాట్లాడారు. నరేంద్ర మోదీ రెండవసారి అధికారంలోకి వచ్చాక కార్పొరేటీకరణ విధానాలు తీసుకువస్తున్నారని ఆయన ఆరోపించారు. తీరు మార్చుకోకుంటే.. ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు.
ఇదీ చదవండి: