ప్రజలకు ఇచ్చిన హామీల్లో 90 శాతం వరకు సీఎం జగన్ నెరవేర్చారని హోంమంత్రి సుచరిత చెప్పారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రూ.12 వేల కోట్లతో... పల్నాడు వాటర్ గ్రిడ్, పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించినట్లు వివరించారు. ఆరోగ్యశ్రీని మెరుగుపరిచి పేదలకు భరోసా ఇచ్చామని అన్నారు.
సంక్షేమ పథకాలకు రూ.46వేల కోట్లు
సీఎం జగన్ ప్రజాసంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారని... సంక్షేమ పథకాలకు ఏడాదిలో రూ.46 వేల కోట్లను వెచ్చించినట్లు మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు.
ఇదీ చదవండి: