గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కృష్ణా పరివాహక ప్రాంతాల్లో మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి పర్యటించారు. కృష్ణా నది తీరంలో అనుమతులు లేకుండా నిర్మిస్తోన్న కట్టడాలపై ఆరాతీశారు. నది ఒడ్డున అక్రమంగా నిర్మిస్తోన్న కట్టడాలను వెంటనే తొలగించాలని అధికారులకు చెప్పారు. పర్యావరణ పరిరక్షణ చట్టాలను ఉల్లఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వారం రోజుల్లో అక్రమ కట్టడాలను తొలగించకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతానని తేల్చిచెప్పారు.
ఇవీ చూడండి : ఆశావర్కర్ల జీతం రూ.10 వేలకు పెంపు