ETV Bharat / state

కరోనా భయంతోనే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.. - కంచికచర్లలో కరోనా వార్తలు

కరోనా వైరస్ కుటుంబాల్లో కల్లోలం రేపుతోంది. ఆనందంగా ఉండే కుటుంబంలో కన్నీరు నింపుతోంది. కృష్ణా జిల్లా కంచికచర్లలో శ్రీనివాసరావు అనే వ్యక్తి అదృశ్యం కలకలం రేపుతోంది. కరోనా సోకిందనే అనే భయంతో శ్రీనివాసరావు ఈనెల 4వ తేదీ ఇంటి నుంచి వెళ్లి పోయారని బంధువులు చెపుతున్నారు.

man missing in kanchikacharla
కంచికచర్లలో వ్యక్తి అదృశ్యం
author img

By

Published : Jul 10, 2020, 5:25 PM IST

కంచికచర్లలో వ్యక్తి అదృశ్యం

కృష్ణా జిల్లా కంచికచర్లలో ఓ వ్యక్తి అదృశ్యం అయ్యాడు. కరోనా సోకిందనే భయంతో అతను ఇంటి నుంచి వెళ్లిపోయాడని బంధువులు తెలుపుతున్నారు. కంచికచర్లకు చెందిన శ్రీనివాసరావు జ్వరం రావటంతో స్థానికంగా ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. తరువాత విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని తెలిపారు. దీంతో శ్రీనివాసరావు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షకు శాంపిల్ ఇచ్చి ఇంటికి వెళ్లాడు. రాత్రంతా ఇంట్లోనే ఉన్న అతను ఈనెల 4వ తేదీ తెల్లవారుజామున ఇంటినుంచి బయటకు వెళ్లిపోయాడు. నిర్ధారణ పరీక్షల్లో నెగటివ్ అని వచ్చింది. వారం రోజుల నుంచి బంధువులు వెతికినా ఆచూకీ లభించకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరావు ఆచూకీ తెలపాలంటూ కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి. హథీరాంజీమఠంలో నగలు మాయం... పోలీసులకు ఫిర్యాదు చేయని మహంతు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.