కృష్ణా జిల్లా మెువ్వ ప్రాంతానికి చెందిన ఓ యువతిపై అత్యాచారం చేసి ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటా బెదిరంచటంతో యువతి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. బాధితురాలు డిగ్రీ పూర్తి చేసి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఉద్యోగం చేసుకుంటూ ఆమె అన్నయ్యతో కలిసి ఉంటుంది. బాధితురాలి ఇంటి పక్కనే అద్దెకు ఉంటున్న వ్యక్తి యువతిపై కన్నేసి అవకాశం కోసం ఎదురుచూశాడు. బాధితురాలి అన్నయ్య ఇంట్లో లేని సమయంలో ఇంట్లోకి చొరబడి ఆమె అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా ఫొటోలు తీశాడు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి స్వగ్రామానికి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. బాధితురాలిని ఆసుపత్రికి తరలించి బంధువులు ఆరా తీయగా విషయం బయటపడింది. నిందితుణ్ని కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి బంధువులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి : గిన్నీస్ బుక్ రికార్డు ప్రయత్నంతో తొక్కిసలాట... ఇద్దరు మృతి!