ETV Bharat / state

మహిళపై కొబ్బరి బొండాల కత్తితో వ్యక్తి దాడి..పరిస్థితి విషమం

విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఓ మహిళపై వ్యక్తి దాడి చేసి గొంతు కోశాడు.. ప్రాణపాయస్థితిలో ఉన్న బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

మహిళపై కొబ్బరి బొండాల కత్తితో వ్యక్తి హత్యాయత్నం.
author img

By

Published : Sep 6, 2019, 11:33 AM IST

మహిళపై కొబ్బరి బొండాల కత్తితో వ్యక్తి హత్యాయత్నం.

విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగల్రాజపురంలో కొండపైన నివాసం ఉంటున్న రామలక్ష్మి ఇళ్ళల్లో పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తితో కొద్దికాలం సహజీవనం చేసిందని పోలీసులు చెబుతున్నారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు రావటంతో రామలక్ష్మి దూరంగా ఉంటుందని పోలీసుల విచారణలో తేలింది. దీంతో నాగేశ్వరావు ఆమెను హత్య చేసేందుకు పథకం రచించాడు. ఇళ్లల్లో పని చేసి వస్తుండగా మార్గమధ్యలో హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. గురువారం సాయంత్రం పని చేసి ఇంటికి వెళ్తున్న రామలక్ష్మిపై కొబ్బరి బొండాల కత్తితో దాడి చేశాడు. రామలక్ష్మి తలను చేత్తో పట్టుకొని కత్తితో పీక కోశాడు. రామలక్ష్మి బిగ్గరగా అరవడంతో సమీపంలోని వారు వచ్చి నాగేశ్వరావుని పక్కకు తోసివేశారు. మెడపై గాయం కావడంతో తీవ్ర రక్తస్రావంతో బాధితురాలు రోడ్డుపై కుప్పకూలిపోయింది. స్థానికులు 108ను పిలిపించి ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాలికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. నాగేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి

విజయవాడ షిర్డిసాయి ఆలయంలో చోరీకి విఫలయత్నం

Intro:బంగళఖాతం లో ద్రోణి కారణంగా మన్యం లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.భారీ వర్షాలపై వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి.మండలం లో గలా జోలపుట్ జలాశయం ప్రమాదస్థాయి కి చేర్పియింది.Body:జోలపుట్ జలాశయం లో మూడు గేట్స్ ద్వారా పదివేల క్యూసెక్డ్ వరద నీటిని విడుదల చేస్తున్నారు.2750 అడుగుల సామర్థ్యం గలా జోలపుట్ లో ప్రస్తుతం 2748.6 అడుగుగులకు చేరింది.Conclusion:వర్షాలు తగ్గుముఖం పట్టక పోతే మరిన్ని గేట్స్ ద్వారా నీటి విడుదల చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.