తెలంగాణలోని హైదరాబాద్ జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఆర్పీ కాలనీకి చెందిన ఫయాజ్‌ను... కొందరు దుండగులు వెంబడించి కత్తులతో పొడిచి చంపారు. దాడి నుంచి తప్పించుకునేందుకు ఫయాజ్ యత్నించినప్పటికీ దుండగులు వెంబడించి క్రూరంగా హతమార్చారు.
సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పాత గొడవల కారణంగా హత్య జరిగి ఉంటుందని భావిస్తున్న పోలీసులు... వివాహేతర సంబంధం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం ఐదు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
ఇదీ చూడండి: విశాఖలో కేంద్ర నిపుణుల బృందం పర్యటన