ప్రతి పౌరుడు తమ బాధ్యతగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే దోమల నివారణ సాధ్యమేనని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మలేరియా అవగాహనా కార్యక్రమాలకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. గతేడాది జిల్లాలో 27 మలేరియా కేసులు నమోదు కాగా...ఈ ఏడాది ఇప్పటి వరకు 4 కేసులు మాత్రమే నమోదైనట్లు కలెక్టర్ తెలిపారు. మలేరియాను సమూలంగా నిర్మూలించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచామని....వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి మలేరియా నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే గుర్తించిన కొన్ని ప్రాంతాలల్లో ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి