రాష్ట్రంలో బలహీనవర్గాలపై దాడులు పెరిపోతున్న దృష్ట్యా వెంటనే స్పందించిన ముఖ్యమంత్రికి మాల మహానాడు రాష్ట్ర జనరల్ సెక్రెటరీ జి వీ రత్నం ధన్యావాదలు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్లో ఎస్సీ యువకుడిపై దాడి ఘటనలో వెంటనే స్పందించిన ఐజీకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ ఘటన మరిచి పోకముందే చీరాలలో ఎస్ఐ దాడిలో మరణించిన యువకుడు మరణించడం దారుణమని, దీనిపై సీఎం స్పందించి యువకుడి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజమండ్రిలో బాలికపై సామూహిక అత్యాచార నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. వైకాపా ప్రభుత్వానికి దన్నుగా ఉండే దళితులపై దాడులు జరిగితే ప్రభుత్వం కూలిపోతుందన్నారు.
ఇవీ చదవండి...