ఎస్సీ వర్గీకరణకు మాల మహానాడు వ్యతిరేకమని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు వెంకటస్వామి అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన వెంకటస్వామి... రెండు రోజులుగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఎస్సీ వర్గీకరణ కుదరదని సుప్రీం ఇచ్చిన తీర్పును గుర్తుచేసిన ఆయన... వర్గీకరణపై మందకృష్ణ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వర్గీకరణ సాధ్యంకాదని తేల్చిచెప్పారని గుర్తు చేశారు. ఇప్పటికైనా మందకృష్ణ అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు. ఎస్సీలను ఎ,బి,సి,డి లుగా విభజించడం రాజ్యాంగ విరుద్ధమని 2005లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆగష్టు 5,6,7 తేదీల్లో విజయవాడ ధర్నా చౌక్ వద్ద సత్యాగ్రహ దీక్షలు చేపడతామని చెప్పారు.
ఇదీ చదవండి : ఎస్సీ వర్గీకరణపై జగన్ వ్యాఖ్యలు సరైనవికావు: మందకృష్ణ