ETV Bharat / state

శివనామ స్మరణతో మార్మోగుతున్న ఆలయాలు - ముక్తేశ్వర క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలు వార్తలు

కృష్ణా జిల్లాలో మహా శివరాత్రి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. శివాలయాలన్నీ భక్తుల రద్దీతో... కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి.

maha sivaratri special puja
శివనామ స్మరణతో మారుమోగుతున్న శివాలయాలు
author img

By

Published : Mar 11, 2021, 3:40 PM IST

దక్షిణకాశిలో...

దక్షిణకాశిలో శివరాత్రి వేడుకలు

కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని దక్షిణకాశిగా పేరొందిన పెదకళ్లెపల్లిలో.. తెల్లవారుజామున మహా శివరాత్రి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. శ్రీ దుర్గా నాగేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. సుమారు లక్ష మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారనీ.. అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.

ముక్తేశ్వర క్షేత్రంలో...

ముక్తేశ్వర క్షేత్రంలో మహా శివరాత్రి వేడుకలు

ఉత్తర వాహిని క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ముక్త్యాల భవాని ముక్తేశ్వర క్షేత్రంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు నదీ స్నాన ఘట్టాల వద్ద స్నానమాచరించి... స్వామి వారి దర్శనానికి పోటెత్తారు. నది ఒడ్డున ఉన్న ముక్తేశ్వరుడికి, కోటిలింగ క్షేత్రంలో ఉన్న పంచముఖేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వరించారు. మూడు రోజుల పాటు జరిగిే కల్యాణోత్సవం, తిరునాళ్లకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచి బారుల తీరిన భక్తులకు... దేవాలయంలో ఉచిత దర్శనం లేకపోవటంతో ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 50,20 టిక్కెట్టు తీసుకున్న వారికే దర్శనం అనే నిబంధన పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాఘవాపురంలో...

నందిగామ మండలం రాఘవాపురం శివాలయంలోని శ్రీ రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామలింగేశ్వరుడిని సూర్యకిరణాలు తాకటంతో.. భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

ఐలూరులో..

ఐలూరులో శ్రీరామేశ్వర స్వామిని స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ దర్శించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

విజయవాడలో...

మహాశివరాత్రి సందర్బంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. విజయవాడలోని పున్నమిఘాట్​, కృష్ణవేణి, పవిత్ర సంగమంలో భక్తులు... తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించి మెుక్కలు చెల్లించుకుంటున్నారు. శివనామస్మరణతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.

ఇదీ చదవండి: రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.