ETV Bharat / state

MACHILIPATNAM PORT TENDERS: మచిలీపట్నం పోర్టు టెండర్లు రద్దు

No tenders for Machilipatnam port: కృష్ణాజిల్లా మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి రెండోసారి పిలిచిన టెండర్లకూ స్పందన లేనందున.. ఏపీ మారిటైం బోర్డు టెండరు ప్రకటనను రద్దు చేసింది. నాలుగు సార్లు గడువు పొడిగించినా ఒక్క బిడ్‌ కూడా దాఖలు కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఓడరేవు నిర్మాణ నమూనాల్లో మార్పులు చేసి మరోసారి టెండర్లు పిలవనుంది.

MACHILIPATNAM PORT TENDERS
MACHILIPATNAM PORT TENDERS
author img

By

Published : Jan 10, 2022, 8:56 AM IST

కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి రెండోసారి పిలిచిన టెండరు ప్రకటననూ ఏపీ మారిటైం బోర్డు రద్దు చేసింది. నాలుగు సార్లు గడువు పొడిగించినా ఒక్క బిడ్‌ కూడా దాఖలు కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఓడరేవు నిర్మాణ నమూనాల్లో మార్పులు చేసి మరోసారి టెండర్లు పిలవనుంది. ఈ ప్రతిపాదనను ప్రభుత్వ ఆమోదం కోసం అధికారులు పంపారు. మొదటిసారి వెలువరించిన టెండరు నిబంధనల్లో మార్పులు చేసి.. రెండోసారి టెండర్లు పిలిచినా గుత్తేదార్ల నుంచి స్పందన రాలేదు. దీంతో నమూనాల్లో స్వల్ప మార్పులు చేసి ప్రయత్నించాలని భావిస్తున్నట్లు ఒక ఉన్నతాధికారి తెలిపారు.

పోర్టు నిర్మాణానికి గత ఏడాది జూన్‌లో మొదటిసారి టెండరు ప్రకటనను బోర్డు జారీ చేసింది. మూడుసార్లు గడువు పొడిగించినా ఒక్క బిడ్‌ అయినా దాఖలు కాలేదు. గుత్తేదారు సంస్థలతో అధికారులు చర్చలు జరిపి.. వారి నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని టెండరు నిబంధనల్లో మార్పులు చేశారు. ఈ మేరకు గత ఏడాది ఆగస్టులో రెండోసారి ప్రకటన జారీ చేశారు. బిడ్‌ దాఖలుకు సంబంధించిన అర్హతలను తగ్గించడం వల్ల మరిన్ని సంస్థలు పోటీ పడతాయని భావించారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. నాలుగు దఫాలుగా గడువులు పెంచి.. దిల్లీ, పుణెకు చెందిన పలు సంస్థలతో అధికారులు చర్చించారు. కనీసం ఒక్క సంస్థ బిడ్‌ దాఖలు చేసినా పనులను అప్పగించాలన్నది అధికారుల ఆలోచన. పోర్టు నిర్మాణానికి రెండోసారి జారీ చేసిన ప్రకటనకూ గుత్తేదార్లు ముఖం చాటేశారు. మొదటిదశలో రూ.3,650 కోట్ల అంచనాలతో పనులను అధికారులు ప్రతిపాదించారు.

ఇదీ చదవండి;

PROTEST ON PROBATION: గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రొబేషన్ పోరాటం.. నేడు విధుల బహిష్కరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.