వరదల కారణంగా పంటలు నష్టపోయిన గుంటూరు జిల్లా రైతులకు... ఎకరాకు రూ.20వేల చొప్పున ఆర్థిక సాయం చెల్లించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. రైతులకు పంటనష్ట పరిహారం చెల్లింపులో జాప్యం తగదని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యుల్ ఆనంద్ కుమార్కు లేఖ రాశారు. గత ఏడాది నష్టపోయిన పంటలకు... పెండింగ్లో ఉన్న పరిహారం తక్షణమే విడుదల చేయాలన్నారు.
ప్రతి రైతు ఎకరాకు సగటున రూ.20వేల వరకు పెట్టుబడి పెట్టారని పేర్కొన్నారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని, మంగళగిరి నియోజకవర్గంలోనే 2వేల ఎకరాలకు పైగా వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయని లేఖలో వివరించారు. ప్రభుత్వ అంచనా ప్రకారం గుంటూరు జిల్లాలో 30,000 ఎకరాలకు పైగా మొక్కజొన్న, వేరుశనగ, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వెల్లడించారు. గత ఏడాది దెబ్బతిన్న పంటలకు చెల్లించాల్సిన పరిహారం... తక్షణమే విడుదల చేయలని లోకేశ్ డిమాండ్ చేశారు. రైతులకు సకాలంలో పరిహారం చెల్లిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: