ETV Bharat / state

తెదేపా కార్యకర్తకు కత్తిపోట్లు... లోకేశ్ ఆగ్రహం..! - lokesh fire on govt about jaggayapet issue

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారితీసింది. తగువులో జోక్యం చేసుకున్నాడన్న కారణంగా ఓ లారీ డ్రైవర్​పై మరోవ్యక్తి చాకుతో దాడికి దిగాడు. చాకు లారీ డ్రైవర్ వీపుపై దిగిన కారణంగా.. తీవ్ర గాయాలయ్యాయి.

తెదేపా కార్యకర్తకు కత్తిపోట్లు... లోకేశ్ ఆగ్రహం..!
author img

By

Published : Sep 12, 2019, 11:45 PM IST

తెదేపా కార్యకర్తకు కత్తిపోట్లు... లోకేశ్ ఆగ్రహం..!

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ తగువులో జోక్యం చేసుకున్నందుకు లారీ డ్రైవర్ సలీమ్​పై మరో వ్యక్తి చాకుతో దాడిచేశాడు. చాకు సలీమ్ వీపులో దిగబడింది. బాధితుడిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు. వైకాపా కార్యకర్తే... తెదేపాకు చెందిన సలీమ్​పై దాడి చేసినట్లు మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ ఆరోపించారు. క్షతగాత్రుణ్ని పరామర్శించిన ఆయన.. మెరుగైన వైద్యం కోసం సలీమ్​ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

లోకేశ్ ఆగ్రహం

జగ్గయ్యపేట ఘటనను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోందా అని ప్రశ్నించారు. ఇంకెంతమంది నెత్తురు చిందించాలని లోకేశ్ నిలదీశారు. ప్రభుత్వ పాలనలో అందరూ ప్రశాంతంగా ఉన్నారన్న హోంమంత్రి.. ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సలీమ్​ను కూడా పెయిడ్ ఆర్టిస్టు అంటారా అని ప్రశ్నించారు. జగన్ పాలన ఎంత అద్భుతంగా ఉందంటే, పేదవాడికి పట్టెడు అన్నం దొరక్కపోయినా, గూండాల దాహానికి తెదేపా కార్యకర్తల రక్తం, ఆకలైతే నరకడానికి పొలాల్లో పంటలు ఉన్నాయని ఆరోపించారు. ఫ్యాక్షన్ భూతాన్ని రాష్ట్రం మీద వదిలారాని లోకేశ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

గ్రామ వాలంటీర్​పై దాడి.. తెదేపా కార్యకర్తల పనే అని ఆరోపణ

Intro:AP_VSP_59_12_RAJMAA VITTANALU KOSAM PADIGAAPULU_AV_AP10153Body:
విశాఖ మన్యంలో రాజ్‌మా చిక్కుళ్లు పంట రారాజుగా వెలుగొందింది. వర్షాభావ పరిస్థితులు కారణంగా అయిదేళ్లుగా పంటలు పండక గిరిజన రైతులు విత్తనాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం రైతులకు ప్రోత్సహించేందుకు 90 శాతం రాయితీతో రాజ్‌మా విత్తనాలను వ్యవసాయశాఖ ద్వారా పంపిణీ చేస్తుంది. వీటిని తీసుకునేందుకు రైతులు బారులు తీరుతున్నారు. గూడెం కొత్తవీధి మండల కేంద్రంలోని వ్యవసాయశాఖ కార్యాలయంలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విత్తనాలు కోసం గిరిజన రైతులు గొడుగులుతో నిరీక్షించారు.

Conclusion:M Ramanarao,sileru
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.