ప్రభుత్వ దుకాణాలు బార్లా తెరిచి.. మద్యపాన నిషేధం అంటూ సీఎం జగన్ కొత్త నిర్వచనం చెప్తున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. శానిటైజర్ తాగించి ప్రజలను పొట్టన పెట్టుకోవడం కూడా నిషేధంలో భాగమేనా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది చనిపోయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనన్న ఆయన.. బాధితుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. మద్యం పేరుతో జగన్ సమాంతర మాఫియాను నడుపుతున్నారన్న లోకేశ్.. దీనిపై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : సీఆర్డీఏపై హైకోర్టు స్టే వెకేట్ చేయాలని సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్