ETV Bharat / state

రాజకీయ ప్రయోజనాల కోసమే బదిలీ చేశారు: లోకేష్

వైకాపా ప్రభుత్వంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. కరోనా కేసులు పెరుగుతుంటే.. నిర్లక్ష్యంతో ఉంటారా? అని నిలదీశారు. కొవిడ్ ఆసుపత్రుల్లో బాధితుల దయనీయ పరిస్థితికి నెల్లూరు జీజీహెచ్ కొవిడ్ ఆసుపత్రిలో ఆత్మహత్య ఘటనే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

lokesh on corona patients
నారా లోకేష్
author img

By

Published : Sep 9, 2020, 9:00 AM IST

నెల్లూరు జీజీహెచ్​ కొవిడ్ ఆసుపత్రిలో పరమేశ్వరమ్మ అనే కరోనా బాధితురాలు ఆత్మహత్య చేసుకుంటున్నా.. ఎవరూ గమనించకపోవటం దారుణమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం జేసీ, నోడల్ అధికారిని అకస్మాత్తుగా బదిలీ చేయటంతో పేషెంట్లపై పర్యవేక్షణ కరవయ్యిందని ఆరోపించారు. కొవిడ్ ఆసుపత్రుల్లో బాధితుల దయనీయ పరిస్థితికి పరమేశ్వరమ్మ ఘటనే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుంటే.. ఇంత నిర్లక్ష్యంతో ఉంటారా అని మండిపడ్డారు. విపత్తుల సమయంలో వ్యవహరించే తీరు ఇదేనా అని నిలదీశారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 10,601 కరోనా కేసులు, 73 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.