కృష్ణాజిల్లా మైలవరంలో పోలీసులు లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలుపరుస్తున్నారు. రద్దీగా ఉండే రైతు బజార్‌ను పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలకు మార్చారు. తెరిచిన దుకాణాలను దగ్గరుండి మూసివేయించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వారికి శానిటైజర్ ఇస్తున్నారు.
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిస్థాయిలో మూసివేశారు. నిన్నటి వరకు దేశీయ ప్రజా రవాణా విమానాలు ఐదు సర్వీసులు నడపగా అర్ధరాత్రి నుంచి వాటినీ నిలిపేశారు.
విజయవాడ నిర్మానుష్యంగా మారింది. నగరం మీదుగా వెళ్లే జాతీయ రహదారులు, అంతర్గత రహదారులకు అడ్డంగా బారికేడ్స్ వేసి వాహనాల రాకపోకలు నియంత్రిస్తున్నారు. నిత్యావసర వస్తువులు తీసుకువెళ్లే వాహనాలకు, అంబులెన్సులు, ఆసుపత్రులకు వెళ్లాల్సిన వారి వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. కారణం లేకుండా రహదారులపై సంచరించేందుకు యత్నిస్తున్న వారిని అడ్డుకుంటున్న పోలీసులు... లాఠీలకు పని చెబుతున్నారు.
విజయవాడ నగర శివారు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలతో రద్దీ పూర్తీ స్థాయిలో తగ్గిపోయింది. విజయవాడ పాయకాపురం, సింగ్ నగర్ ప్రాంతాల్లోని వాంబేకాలనీ, ఇతర ప్రాంతాలపై దృష్టి సారించారు. నున్న గ్రామీణ పోలీసులు.. నగర శివారులోని వివిధ కాలనీల్లో రోడ్లపై తిరుగుతున్న యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.
కృష్ణా జిల్లా గుడివాడలో లాక్డౌన్ అమలు తీరును జిల్లా ఏఎస్పీ సత్తిబాబు పర్యవేక్షించారు. స్థానిక పోలీసులతో కలిసి పట్టణంలో రహదారులను పరిశీలించారు.
ఇదీ చూడండి: