పలు జిల్లాల్లో పోలీసులు నిర్వహించిన దాడుల్లో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని, నాటుసారాను పట్టుకున్నారు. పలువురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
కర్నూలు జిల్లాలో..
కర్నూలు సరిహద్దు పంచలింగాల చెక్ పోస్టు వద్ద ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. తెలంగాణ నుంచి అక్రమంగా ఆటోలో తరలిస్తున్న 177మద్యం సీసాలను పట్టుకున్నారు. ఆటోను స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్కు తరలించారు.
గుంటూరు జిల్లాలో..
గుంటూరు జిల్లా ములకలురు గ్రామంలో పోలీసులు నిర్వహించిన దాడుల్లో 50 సీసాల తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వినుకొండ పట్టణంలో నిర్వహించిన దాడుల్లో మూడు లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని ఇద్దరు ముద్దాయిలను రిమాండ్కు పంపారు.
తూర్పుగోదావరి జిల్లాలో..
తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గోదావరి లంకలో పోలీసులు జరిపిన దాడుల్లో 9,600 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. పరారైన నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
ఇదీ చదవండి