కృష్ణా జిల్లా నందిగామలో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. నందిగామ అనాసాగరం సమీపంలో కారులో తరలిస్తన్న 1000 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలోని సూర్యాపేట నుంచి నందిగామకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: పదో తరగతి, ఇంటర్ పరీక్షలపై పునరాలోచించండి