కృష్ణా వరద ప్రవాహానికి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి వద్ద కాలువ గేటు లీక్ అయ్యింది. రైతులు జలవనరుల శాఖ అధికారులు ఇసుక బస్తాలతో కాలువ లీకేజీని పూడ్చారు. ఈ సాయంత్రానికి వరద ప్రవాహం మరింత ఎక్కువగా వస్తుందన్న సమాచారంతో అధికారులు ముందస్తు జాగ్రత్తగా 2 ట్రాక్టర్ల ఇసుక బస్తాలను సిద్ధం చేసి ఉంచారు. మరోవైపు ఉద్దండరాయునిపాలెం లంకలో స్థానిక శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి పర్యటించారు. వరద బాధితులకు వీలైనంత సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. లంకలో చిక్కుకున్న వరద బాధితులును సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
ఇదీ చూడండి