ETV Bharat / state

తెలంగాణ : ముళ్లకంచెలో చిరుత... ఎట్టకేలకు చిక్కిందిలా - తెలంగాణలో చిరుత తాజా వార్తలు

తెలంగాణలో ఓ చిరుత హల్ చల్ చేసింది. నల్గొండ జిల్లా రాజుపేట తండాలోని ఓ పొలంలో ముళ్లకంపలో చిక్కుకున్న చిరుతను.. అటవీ అధికారులు పట్టుకున్నారు. చిరుతను పట్టుకునే క్రమంలో ..ఇద్దరు అటవీశాఖ సిబ్బందికి గాయాలయ్యాయి.

leopard caught in the barbed wire in raju thanda
రాజుతండాలో చిరుత
author img

By

Published : May 28, 2020, 1:41 PM IST

Updated : May 28, 2020, 3:16 PM IST

అడవిలో విహరించాల్సిన చిరుత పొలాల్లోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా రాజుపేట తండాలో ముళ్లకంచెలో చిక్కుకుకుని విలవిల్లాడింది. అటవీ అధికారులు శ్రమించి చిరుతను బయటికి తీశారు. రాజుపేట తండా గ్రామ శివారులో కృష్ణ నాయక్ వ్యవసాయం చేస్తున్నాడు. పంటకు రక్షణగా ముళ్లకంచెను ఏర్పాటు చేసుకున్నాడు. చిరుత పొరపాటున వచ్చి ముళ్లకంచెలో ఇరుక్కుంది. విలవిల్లాడుతుండగా స్థానికులు గమనించారు.

చిరుతను రక్షించేందుకు అటవీశాఖ అధికారులు శ్రమించారు. ముళ్లకంచె నుంచి తప్పించేందుకు గంటల తరబడి యత్నించారు. ఎట్టకేలకు సురక్షితంగా బోనులో బంధించారు. ఈక్రమంలో ఇద్దరు అటవీశాఖ సిబ్బందికి గాయాలయ్యాయి.

ఇవీ చూడండి:

'మహానేత ఎన్టీఆర్​కు భారతరత్న ఇవ్వాలి'

Last Updated : May 28, 2020, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.