Kuchipudi to Avanigadda Main Road Completely Destroyed : రహదారిలో పెద్ద వాహనాలు ప్రయాణిస్తే.. పొగమంచు కమ్మేసిట్లు రోడ్డు మొత్తం ఎలా దుమ్ము, ధూళితో నిండిపోతుందో.! బస్సు దాటగానే... బైక్ వెనుక సీటులో కూర్చున్న మహిళ ఎలా ఇబ్బంది పడుతుందో..! కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం కూచిపూడి నుంచి అవనిగడ్డ వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమైపోవడంతో.. ఇక్కడి ప్రజలు పడుతున్న పాట్లు ఇవి.
Road Completely Destroyed in Krishna District : పలుమార్లు రోడ్డు వేయండి సారూ.. అని మొరపెట్టుకున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు ముఖం చాటేయడంతో వాహనదారులు నిత్యం నరకం చూస్తున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తున్నామనే సాకుతో రహదారులు పరిస్థితిని పట్టించుకోకపోవడం దారుణమని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతుకుల రోడ్లపై ప్రమాణించడం వల్ల.. వాహనాలతో పాటు తమ ఆరోగ్యాలు కూడా పాడైపోతున్నాయని వాపోతున్నారు.
Roads Damage in Gudivada: నోరు తెరిచి జగన్‌ను నిధులు అడగలేదా..? అడిగినా ఇవ్వలేదా..!
Damaged Roads In Avanigadda : కూచిపూడి నుంచి మొవ్వ, కొడాలి, మోపిదేవి, చల్లపల్లి, ఇతర గ్రామల వరకు రోడ్డు దారుణంగా తయారైంది. లారీలు, బస్సులు, ట్రాక్టర్ల తాకిడికి అవి రాళ్ళు తేలి పెద్దవిగా మారాయి. దీంతో ఈ రహదారిపై ప్రయాణ ప్రమాదకంగా మారింది. రోడ్డుపై రాళ్లు తేలి వాహనదారులను భయపెడుతున్నాయి. కూచిపూడి నుంచి ఒక్కసారి మొవ్వ వెళ్లితే ఆ దుమ్ముకు సాన్నం చేయాల్సిందేనని వాహదారులు చెబుతున్నారు. రోడ్డపై భారీ గుంతలు పడటంతో ద్విచక్ర వాహనదారులు నెమ్మదిగా వెళ్తున్నా ప్రమాదాల బారిన పడుతున్నారు. నరకదారిలో నిత్యం ప్రయాణిస్తూ విసిగిపోయిన ఓ వాహనదారుడు తన కోపాన్ని ఇలా వ్యంగ్యంగా చెప్పుకున్నాడు. భారీ గోతులు పడటంతో వాహనాలు ఆ గొతుల్లో ఇరుక్కుపోతున్నాయని మరో వాహన దారుడు సమధానం ఇచ్చారు.
స్థానికులు ఆగ్రహం : ఇటీవల కూచిపూడి రహదారిపై ప్రయాణికులు పడుతున్న అవస్థలను ఈటీవీ ప్రసారం చేయడంతో అధికార యాంత్రం అప్రమత్తమైంది. భారీగా ఏర్పడిన గుంతలను తాత్కాలికంగా పూడ్చారు. పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్.. కూచిపూడి రహదారిని పరిశీలించి నూతన రహదారి నిర్మాణం చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే హామీతో తమకు కొత్త రోడ్డు వస్తుందని వాహనదారులు, స్థానికులు భావించారు. కానీ ఇప్పటికీ రోడ్డు నిర్మాణం జరగకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
AP Government Neglecting on Roads : ఈ రహదారి అభివద్ధికి అవసరమైన నిధుల కేటాయింపుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. కాలం గడిచిపోతున్నా సమస్య మాత్రం పరిష్కారం కావటం లేదని వాపోతున్నారు. ప్రధాన రహదారి సమస్య ఎవరికీ పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు, వాహనదారులు ఈ రహదారిపై ప్రయాణం చేయాలంటే భయపడుతున్నారు. గ్రామంలోకి వెళ్లే వారు చాలా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి రహదారిని పునర్నిర్మాణం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Damage Roads in AP నమ్మినా నమ్మకపోయినా ఈ రోడ్డు వేసింది.. 9 నెలల క్రితమే! ప్రయాణించారో.. అంతే!