ETV Bharat / state

కృష్ణమ్మ శుద్ధి సేవలో.. 'నేను సైతం' - vijayawada

కృష్ణా నది ప్రక్షాళనకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. అందుకు సంబంధించిన గోడ పత్రికలను కలెక్టర్ ఇంతియాజ్, నగర పాలక కమీషనర్ రామారావు విడుదల చేశారు.

కృష్ణానది ప్రక్షాళన
author img

By

Published : May 1, 2019, 7:56 PM IST

కృష్ణమ్మ శుద్ధి సేవలో.. 'నేను సైతం'

ఎన్నో వేల ఎకరాలకు సాగునీరు, లక్షల మందికి తాగు నీరు అందిస్తున్న కృష్ణమ్మ ప్రక్షాళనకు అధికారులు నడుం బిగించారు. కృష్ణా నది ప్రక్షాళనకు సంబంధించిన గోడ పత్రికలను కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్, నగరపాలక కమిషనర్ రామారావుతో కలిసి విడుదల చేశారు. 2,3 తేదీల్లో కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఇకపై ప్రతీ నెలా కార్యక్రమాన్ని కొనసాగించాలని సూచించారు. నగరం నుంచి వచ్చే మురుగునీరు నదిలో కలవకుండా చర్యలు తీసుకోనున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలతో పాటు.. స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. కృష్ణమ్మ శుద్ధి సేవలో 'నేను సైతం' అనే నినాదాన్ని ఇవ్వడం ద్వారా నది ప్రక్షాళనలో భాగం కావాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు.

ఇది కూడా చదవండి.

రోడ్డు ప్రమాదాలు తగ్గటం...శుభాపరిణామం : కలెక్టర్

Intro:333

Body:8888

Conclusion:ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కర్నూలు అటవీ శాఖ సహాయ ముఖ్య సంరక్షణ అధికారి గోపీనాథ్ ఆదేశించారు .స్మగ్లర్లపై కేసులు పెట్టిన తర్వాత వెంటనే వారిని అరెస్టు చేయాలని ఆదేశించారు ఏళ్ల తరబడి కాలహరణం చేస్తే బాధ్యులైన అధికారులపై వేటు పడుతుందని తెలిపారు .కడప జిల్లా బద్వేలులో అటవీశాఖ అధికారులతో ఈరోజు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. 2018లో చేపట్టిన పనులు ,ఈ ఆర్థిక సంవత్సరంలో చేయాల్సిన పనుల పై ఆయన దశ దిశ నిర్దేశం చేశారు .ఈ సమావేశానికి డిఎఫ్ఓలు గురు ప్రభాకర్ ర్ వెంకటేశ్వర్లు ,ప్రొద్దుటూరు డివిజన్ సంబంధించిన అటవీశాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.